ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.
అరుణ్‌కుమార్ అక్టోబర్ 17న తెలిపారు.కాగా, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు.
కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు.ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.