కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఎన్నికయ్యారు.తాజాగా పూర్తయిన ఓట్ల లెక్కింపులో శశి థరూర్పై ఖర్గే భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఖర్గేకు 7,897 ఓట్లు రాగా శశిథరూర్ కు 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు.
ఈ నేపథ్యంలో కార్గే వర్గీయులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.