లొకేషన్ పంపినా బేఖాతరు .. గోల్డీ బ్రార్‌ను రక్షిస్తోన్న కెనడా? వెలుగులోకి సంచలన విషయాలు

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి ( gangster Lawrence Bishnoi )అత్యంత సన్నిహితుడు, మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను పట్టుకోవడంపై భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కెనడా నీరుగార్చిన విషయం వెలుగుచూసింది.పంజాబ్ ప్రభుత్వం ‘కేటగిరీ – ఏ ’( Category – A ) లో చేర్చిన క్రిమినల్స్‌లో గోల్డీ బ్రార్ ఒకరు.

 Sensational Things Come To The Light Of Canada Protecting Goldie Brar Regardless-TeluguStop.com

పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య సహా పలు ప్రధాన కేసుల్లో గోల్డీ బ్రార్ నిందితుడిగా ఉన్నాడు.మూసేవాలా హత్య తర్వాత అతనిని భారత నిఘా వర్గాలు టార్గెట్ చేశాయి.

అమెరికా , కెనడాలలోని పలు ప్రాంతాలలో గోల్డీ బ్రార్ సంచరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Telugu Canada, Punjabgang-Telugu Top Posts

మే 2022లో మూసేవాలా హత్య తర్వాత పంజాబ్ పోలీసులు కెనడాలో గోల్డీ బ్రార్ లొకేషన్‌ని( Goldie Brar location in Canada ) భారత ప్రభుత్వం ద్వారా కెనడాకు అందజేశారు.అయితే కెనడియన్ భద్రతా ఏజెన్సీలు ఎలాంటి సానుకూల స్పందనను ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి.అంతేకాదు కెనడా ప్రస్తుతం అతనిని తన మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించింది.

మరోవైపు గతేడాది సర్రేలో హత్యకు గురైన ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక గోల్డీ బ్రార్ అతని స్నేహితుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపణలు చేస్తోంది.అయితే గోల్డీ బ్రార్ ప్రస్తుతం కెనడాలోని సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లుగా భారత్ అనుమానిస్తోంది.

Telugu Canada, Punjabgang-Telugu Top Posts

కెనడాలో నిన్నటి వరకు భారత హైకమీషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ ( Sanjay Kumar Verma )కూడా గోల్డీ వ్యవహారంలో ఒట్టావా ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మా అభ్యర్ధన మేరకు గతంలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గోల్డీ బ్రార్ పేరు ఉండేదని, కానీ ఆకస్మాత్తుగా జాబితాలోంచి మాయమైపోయాడని వర్మ తెలిపారు.పంజాబ్ పోలీస్ యంత్రాంగం కూడా సంజయ్ కుమార్ వర్మ వాదనలతో ఏకీభవిస్తోంది.మార్చి 17, 2017లో విద్యార్ధి వీసాపై గోల్డీ బ్రార్ కెనడాకు వెళ్లిన వివరాలను కూడా పంజాబ్ పోలీసులు ఇప్పటికే సమర్పించారు.

మూసేవాలా హత్య తర్వాత తాము కెనడా ప్రభుత్వానికి గోల్డీ బ్రార్ గురించి అన్ని వివరాలు అందించామని ఓ పోలీస్ అధికారి చెప్పారు.బ్రార్ తన ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించే స్టడీ వీసాపై కెనడాకు వెళ్లాడని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube