కొంతమందికి అదృష్టం అలా కలిసి వస్తుంది.ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేదు.
ఏ పార్టీలో చేరినా, పదవులు వరుస్తూ ఉంటాయి.అటువంటి అదృష్టవంతుల జాబితాలో మరోసారి చేరబోతున్నారు సీనియర్ పొలిటిషన్ కె .కేశవరావు( Senior Politician K Keshava Rao ). మొదట్లో జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిన కేశవరావు ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు.ఆ పార్టీలో అనేక పదవులను పొందారు.తెలివితేటలు , సామాజిక వర్గం కోణం ఇవన్నీ బాగా కలిసి రావడంతో కేశవరావుకు ఏ పార్టీలోకి వెళ్లినా పదవులు అలా వరిస్తూనే వస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులను అనుభవించారు.ఇక ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ( BRS Party )లో చేరారు.స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో, జనం నాడి ఏ విధంగా ఉంటుందో ముందుగానే అంచనా వేసి అధినేత కేసిఆర్( KCR ) కు సలహాలు, సూచనలు ఇవ్వడం వంటి వాటితో కేసిఆర్ కు మరింత సన్నిహితంగా మారారు.దీంతో బీఆర్ఎస్ రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇచ్చింది.
అంతే కాదు పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గాను ఆయనను నియమించారు.అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మిని జిహెచ్ఎంసి మేయర్ ను చేశారు కేసీఆర్.ఒకే నేతకు, ఆయన కుటుంబానికి ఇన్ని పదవులా అంటూ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పెదవి విరిచినా కేసీఆర్ అవేమి పట్టించుకోలేదు.కేకేకు అంతస్థాయిలో ప్రాధాన్యమిస్తూ వచ్చారు.దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉంటూ అనేక పదవులు అనుభవించిన కేశవరావు ఇప్పుడు కాంగ్రెస్( Congress ) లో చేరేందుకు సిద్ధమవుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఏఐసిసి కార్యదర్శి దీపా దాస్ మున్షి స్వయంగా కేకే నివాసానికి వచ్చి ఆయనను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించడంతో, కేశవరావు అంగీకారం తెలిపినట్లు సమాచారం .
ఇదే విషయాన్ని ఎర్రవల్లిలోని కేసిఆర్ ఫామ్ హౌస్( KCR Farm House ) కు వెళ్లి కేసిఆర్ కు ఈ విషయాన్ని చెప్పగా , ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.పార్టీలో ఏం తక్కువ చేసామని కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.అయితే కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో చిక్కుకుపోవడంతో ఆ కేసుల నుంచి బయటపడేందుకే కాంగ్రెస్లోకి వెళ్లాలని కేసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.మరో రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు కేకే సిద్ధమవుతున్నారు ఆయనకు ఆ పార్టీలో కీలక పదవి దక్కబోతున్నట్లు సమాచారం.