మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో( Bill Gates ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Modi ) ‘చాయ్ పే’ చర్చ జరిగింది.మహిళా సాధికారిత, వాతావరణ మార్పులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి పలు అంశాలపై ఇరువురు చర్చించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ వినియోగం అవసరమని పేర్కొన్నారు.జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీ ( AI Technology ) వినియోగించుకున్నామన్నారు.డిజిటల్ టెక్నాలజీతో సామాన్యులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమని తెలిపారు.ఇప్పుడు నేరుగా ప్రభుత్వం నుంచి పేదవారికి అన్నీ అందుతున్నాయని చెప్పారు.
డిజిటల్ రంగంలో( Digital Technology ) భారత్ చాలా మార్పులు తీసుకొచ్చిందన్న ప్రధాని మోదీ చిరుధాన్యాల వలన అధిక ప్రయోజనమని తెలిపారు.తక్కువ నీరు, ఎరువులు లేకుండా సాగవుతుందన్నారు.చిరుధాన్యాల వినియోగం పెరిగి హోటళ్లలో కూడా మెనూగా ఉంటుందని పేర్కొన్నారు.చిరుధాన్యాల సాగుతో చిన్న రైతుల జీవితాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు.అలాగే కోవిడ్ ను( Covid ) ఎదుర్కొనేందుకు క్రమ పద్ధతిలో పోరాటం చేశామన్నారు.ఈ క్రమంలో తాము ఇచ్చిన సూచనలు, సలహాలను ప్రజలు పాటించారని మోదీ వెల్లడించారు.