ప్రస్తుత వింటర్ సీజన్ లో చర్మం తరచూ పొడిబారిపోతుంటుంది.అందులోనూ డ్రై స్కిన్ కలిగిన వారిని ఈ సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.
చర్మం పొడిబారడం వల్ల దురద, చికాకు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.మరియు పొడి చర్మం వల్ల ముఖం నిర్జీవంగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే పొడిబారిన చర్మాన్ని నివారించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ క్రీమ్ ను కనుక వాడితే పొడిబారిన చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మార్చుకోవచ్చు.
మరి ఇంతకీ వింటర్ లో పొడి చర్మం నుంచి విముక్తి కలిగించే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది బాదం పప్పులు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అదే గిన్నెలో ఒక కప్పు పాలు పోసి నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న బాదం పప్పు, బియ్యాన్ని పాలతో సహా మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.

చివరిగా ఆఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి మరోసారి మిక్స్ చేస్తే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ క్రీమ్ ను రాసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను కనుక వాడితే పొడిబారిన చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది.
మరియు నిర్జీవంగా మారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.కాబట్టి ప్రస్తుత వింటర్ సీజన్ లో ఈ క్రీమ్ ను తప్పకుండా ట్రై చేయండి.







