భారతీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయినటువంటి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ ఝలక్ ఇచ్చింది.అవును, తాజాగా క్రెడిట్ కార్డుకు సంబంధించి 2 కీలక మార్పులు తీసుకువచ్చింది.అదేమంటే, మొదటిది… EMI లావాదేవీలపై ఇపుడు ఉన్న ప్రాసెసింగ్ ఫీజు రూ.100 వరకు పెంచేసింది.ఇక రెండోది రెంట్ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు షాక్ ఇచ్చింది.ఇకపోతే ఈ నిబంధనలు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయని గుర్తు పెట్టుకోండి.
అంటే ఏదైనా వస్తువు మీరు కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం లావాదేవిని EMI లావాదేవీగా మార్చినపుడు రూ.100 వర్తించే పన్నులు SBI ఇపుడు వసూలు చేస్తోంది.ఇకపోతే నవంబర్ 15 నుంచి ఆ ప్రాసెసింగ్ ఫీజును రూ.199 వరకు ఛార్జ్ చేయనున్నారు.అలాగే రెంట్ పేమెంట్ లావాదేవీలపై ఇంత వరకు ఎలాంటి ఛార్జ్ వాసులు చేయని SBI ఇకపై రూ.99+ వర్తించే పన్నులు వసూలు చేయనుంది.అయితే నవంబర్ 15లోపు లావాదేవీలు చేసే వారికి మాత్రం ఈ ఛార్జీలు వర్తించవు అని గుర్తు పెట్టుకోవాలి.
ఇకపోతే ప్రస్తుతం బ్యాంకులు అన్నీ కూడా థర్డ్ పార్టీ పేమెంట్స్ అందిస్తున్న ‘రెంట్‌పే’ ఆప్షన్‌పై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ICCI బ్యాంక్ కూడా సదరు లావాదేవీలపై 1% ఫీజు వసూలు చేయనుందనే విషయం విదితమే.ఈ ఛార్జీలను అక్టోబర్ 20 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే ఆ బ్యాంక్ ప్రకటించడం మనకు తెలిసినదే.ఈ తరుణంలో తాజాగా SBI సైతం రూ.99+ చొప్పున వసూలు చేయాలని అనుకోవడం కొసమెరుపు.వాస్తవానికి రెంట్ పేమెంట్, మెయింటనెన్స్ అనేవి పైకి చెప్పే మాటలే.వాస్తవంలో జరిగేది వేరు.చాలా మంది వినియోగదారులు తమ అవసరాలకు నగదు అవసరం అయినప్పుడు ఈ సేవలను వినియోగించుకుంటున్నారన్నది వాస్తవం.