నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’. అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ షో టాప్ లో నిలిచింది.
ఆహా ఓటిటి లో స్టార్ట్ అయినా ఈ షో అందరి అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.సినీ సెలెబ్రిటీలు అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది.
ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులకు బాలయ్య మరోసారి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇటీవలే ఈ సీజన్ 2 స్టార్ట్ అయ్యింది.అక్టోబర్ 14న మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.
మొదటి ఎపిసోడ్ లో బాలయ్య చంద్రబాబును, అల్లుడు లోకేష్ ను తీసుకు వచ్చాడు.ఈ ఎపిసోడ్ సూపర్ రెస్పాన్స్ అందుకుని రికార్డ్ వ్యూస్ సాధించింది.ఇక ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కోసం మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

రెండవ ఎపిసోడ్ లో గెస్ట్ ఎవరు వస్తారా అని ఎదురు చూసిన వారికీ కోసం ఒక వార్త వైరల్ అయ్యింది.మరి నెక్స్ట్ ఎపిసోడ్ కు ఇద్దరు యంగ్ హీరోలు రాబోతున్నారు.
మరి ఆ హీరోలు ఎవరంటే డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ తో పాటు మరొక హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని తెలుస్తుంది.
దీనిపై మేకర్స్ అధికారిక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.వీరిద్దరూ ఈ షోలో బాలయ్యతో సందడి చేస్తే ఈ ఎపిసోడ్ మరో రేంజ్ లో ఉంటుంది.ఇక బాలయ్య ప్రెజెంట్ తన 107 సినిమాతో బిజీగా ఉంటూనే ఈ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్నారు.







