సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అలాగే కలెక్షన్ లలో కూడా పోటీ లేకపోవడంతో దూసుకు పోతున్నాడు.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.
ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్.
మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట‘ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ లలోకి వచ్చింది.
మొదటి రోజు టాక్ ఎలా ఉన్న కూడా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోయిందనే చెప్పాలి.ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతుంది.
ఇక ఇప్పుడు మూడవ వారంలోకి అడుగు పెట్టింది.మొదటి రోజే ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా మూడవ వారం వరకు ప్రదర్శించ బడుతుంది అంటే మహేష్ స్టామినా ఏంటో తెలుస్తుంది.
![Telugu Keerthi Suresh, Mahesh Babu, Parasuram, Sarkaruvaari-Movie Telugu Keerthi Suresh, Mahesh Babu, Parasuram, Sarkaruvaari-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/06/mahesh-babu-keerthi-suresh-collections.jpg )
ఈ సినిమా రెండు వారాలు సాలిడ్ నెంబర్స్ తో వసూళ్లు రాబట్టింది.అయితే మూడవ వారంలో కొత్త సినిమాలు రావడంతో ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది.పలు చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయట.ఇలా ఇప్పటికి కూడా సర్కారు తన హవా ను కొనసాగిస్తుంది.