తాజాగా పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో నడుస్తుందని అన్నారు.దీనిపై స్పందించిన మన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయిత గజపతిరాజు
” మన్సాస్ ట్రస్టు విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటకు తీసుకొస్తున్నా.
అందుకు నాపై టీడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు.వాటిని అసలు నమ్మవద్దు.
నేను హిందువులైన ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజుల పెద్ద కుమార్తెను.మా అమ్మగారు పునర్వివాహం చేసుకున్న రమేశ్ శర్మ గారు ఒక పురోహిత కుటుంబనాకి చెందినవారు.
నేను మీలాగే హిందువును అలాగే ఇతర మతాలను గౌరవిస్తాను అని పవన్ ను ఉద్దేశించి సంచయిత గజపతిరాజు అన్నారు”.
అంతేకాకుండా మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోవాలని హుందాతనం ఉన్న పవన్ ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడమో లేదా ఒక ప్రకటన చేయడమో వంటిది చేయాలని ఆమె సూచించారు.
గత కొద్దిరోజులుగా మన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈమధ్య ముగిసిపోయింది అనుకున్న ఈ అంశం మళ్లీ తెర మీదకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.