సంపూర్ణేష్ బాబు. తెలంగాణ నుంచి వచ్చిన మనసున్న యాక్టర్.
చేసింది కొన్ని సినిమాలే అయినా.ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
చిన్న హీరో అయినా తన మనసు చాలా గొప్పది అని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు సంపూ.ఆయనకు సినిమాల ద్వారా వచ్చేది తక్కువ రెమ్యునరేషనే అయినా.
జనాలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ తాను ఉన్నాను అంటూ ఉడుతా భక్తిగా సాయం చేసి మరింత గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
వాస్తవానికి సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి.
తెరపై సంపూర్ణేష్ బాబుగా పాపులర్ అయిన ఈ నటుడు బయట మాత్రం నరసింహాచారి మాదిరిగానే జీవిస్తున్నాడు.తాజాగా తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తన జీవితంలో కెమెరా ముందు సంపూర్ణేష్ బాబుగా.కెమెరా లేకుంటే నర్సింహా చారిలా బతుకుతున్నట్లు వెల్లడించాడు.
తన ఇంట్లోకి కావాల్సిన సరుకులను తానే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటానని చెప్పాడు.సిద్ధిపేటలో బైక్ వేసుకుని జాలీగా తిరుగుతానని చెప్పాడు.
తన ఊర్లో తనను అంతగా ఎవరూ పట్టించుకోరని చెప్పాడు.చారి వచ్చినట్లు ఉంటుందన్నాడు.
తన జీవితంలో రెండు లైఫ్ లు ఉన్నాయన్నాడు.

అటు తన జీవితం చాలా కష్టాల మయం అని చెప్పాడు.తాను 7వ తరగతిలో ఉండగానే తండ్రి చనిపోయినట్లు వెల్లడించాడు.అప్పుడు తన ఇద్దరు అక్కలు బీడీలు చేసేవారని చెప్పాడు.
వారి సంపాదన తోనే తాను 10 వరకు చదివినట్లు చెప్పాడు.ఆ తర్వాత బంగారం పని నేర్చుకున్నట్లు చెప్పాడు.
అక్కడ తనకు 10 నుంచి 12 వేల రూపాయలు వచ్చినట్లు చెప్పాడు.వాటిని కుటుంబానికి షాప్ రెంటుకు ఉపయోగించేవాడినని చెప్పాడు.

అటు హ్రుదయకాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు చేసిన చక్కటి గుర్తింపు తెచ్చుకున్న సంపూ.తాజాగా నటించిన సినిమా క్యాలీఫ్లవర్. ఈ సినిమా ఈ నెల 26న సినిమా థియేటర్లలోకి రానుంది.శీలో రక్షతి రక్షితః అనే ట్యాగ్‌లైన్.
ఈ సినిమాను దర్శకుడు ఆర్కే మలినేని తెరకెక్కించాడు.ఈ సినిమా జనాలను ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి.