నైజాం లో 'సలార్' మూవీ టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా..! సామాన్యులు సినిమా చూడొద్దా?

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ కూడా ఎన్నో ఆశలు మరియు అంచనాలతో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటి సలార్.

కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలన విజయాలు తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ( Prabhas , Prashanth Neel )లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో సినిమా చెయ్యడం తో షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉండేవి.

కానీ సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కావాల్సిన ఈ సినిమాని కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 22 వ తేదికి వాయిదా వేశారు.అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కేవలం ఒకే ఒక్క చిన్న టీజర్ తో జరిగిన బిజినెస్ ఇదంతా.ఆంధ్ర మరియు తెలంగాణ లో మాత్రమే కాదు, ఓవర్సీస్ మరియు బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది.

ఇక డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ వంటివి కూడా ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయాయి.వ్యాపారం ఆ స్థాయిలో జరిగినప్పుడు కచ్చితంగా టికెట్ రేట్స్ కూడా అదే స్థాయిలో జనాలకు విక్రయించాల్సి ఉంది.అందుకే సలార్( Salaar ) కి పెట్టబోతున్న టికెట్ రేట్స్ గురించి ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి.

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి 150 కోట్ల రూపాయలకు జరిగింది.ఇందులో కేవలం తెలంగాణ ప్రాంతానికి 65 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

మైత్రి మూవీ మేకర్స్ ( Mythri Movie Makers )ఈ రైట్స్ ని కొనుగోలు చేసారు.అయితే టికెట్ రేట్స్ కూడా వాళ్ళు అదే స్థాయిలో పెట్టబోతున్నట్టు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం వీకెండ్ లోపే రాబట్టి సేఫ్ జోన్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట.సినిమాకి మంచి క్రేజ్ ఉంది, ఎంత టికెట్ రేట్స్ పెట్టినా జనాలు కొని వెళ్తారు.అందుకే మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి 410 రూపాయిలు, సింగల్ స్క్రీన్స్ కి 250 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టాలని చూస్తున్నారట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కేవలం హైదరాబాద్ సిటీ లోనే కాదు, తెలంగాణ ప్రాంతం మొత్తం ఈ రేట్స్ తోనే సినిమాని రన్ చేయబోతున్నారట.ఇదే ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్న విషయం.

Advertisement

ఇక్కడ ఒక చిక్కు ఉంది, టాక్ బాగుంటే కచ్చితంగా బయ్యర్స్ అంచనా ప్రకారం వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుకి చేరుకుంటుంది కానీ, ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం నష్టాలు మామూలు రేంజ్ లో ఉండవు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

తాజా వార్తలు