వరుణ్ తేజ్ లాంటి వాడైతే ఓకే అంటోన్న బ్యూటీ

ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

 Sai Pallavi, Varun Tej, Fidaa, Would-be-TeluguStop.com

ఇక ఫిదా సినిమా టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమా తరువాత ఎంసీఏ, పడి పడి లేచె మనసు చిత్రాలతో తెలుగు జనాలకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ.

అటు తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ తనదైన మార్క్ వేసుకుంది.కాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలా అనే విషయంపై ఇటీవల సాయి పల్లవి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.

తనకు వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి కనిపిస్తే వెంటనే ఐలవ్ యు చెప్పేసి పెళ్లి చేసుకుంటానంది.అయితే ఇక్కడ వరుణ్ తేజ్ అంటే హీరో కాదండోయ్.

ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ చేసిన పాత్ర లాంటి అబ్బాయి కావాలని ఆమె అంటోంది.

మొత్తానికి మెలిక పెట్టి మరీ తనకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసింది ఈ బ్యూటీ.

ఇక సినిమాల పరంగా సాయి పల్లవి ప్రస్తుతం రానా దగ్గుబాటి సరసన విరాట పర్వం, నాగ చైతన్య సరసన లవ్‌స్టోరి చిత్రాల్లో నటిస్తోంది.మరి ఈ బ్యూటీకి ఫిదా సినిమాలోని వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి దొరుకుతాడా లేడా అనేది కాలమే చెబుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube