ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సోకకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
ఈ క్రమంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.అయినా రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1500 దాటింది.దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో తమవంతు సాయంగా పలువురు విరాళాలు అందజేశారు.సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వారి నుండి మొదలుకొని సామాన్యుల వరకు చాలా మంది విరాళాలు అందజేస్తున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన 82 ఏళ్ళ బామ్మ సల్బా ఉస్కర్ తన పెన్షన్ డబ్బులో నుండి రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేసింది.కాగా తాజాగా మిజోరాం రాష్ట్రంలోని కొలసిబ్ పట్టణానికి చెందిన ఏడేళ్ల రోమెల్ అనే బుడతడు తన పిగ్గీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.333 కొలసిబ్ పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ టీంకు అందజేశాడు.దీంతో అక్కడున్న వారు ఈ బుడ్డోడికి హ్యాట్సాఫ్ చేస్తున్నారు.అయితే ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చేరడంతో ఆయన ఈ బుడ్డోడిని మెచ్చుకున్నారు.మొత్తానికి ప్రస్తుతం రోమెల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.