రామ్ చరణ్ మనసు దోచిన పిల్ల.. ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 Ram Charan Favorite Actress, Ram Charan, Sai Pallavi, Rrr, Telugu Movie News, He-TeluguStop.com

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

అయితే నేటితరం హీరోయిన్లలో చరణ్‌కు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు సమాధానం ఏమిటో చాలా మందికి తెలియదు.కానీ ఇటీవల చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎలాంటి సందేహం లేకుండా ఠక్కున సాయి పల్లవి పేరును చెప్పేశాడు.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తనకు సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్ స్టెప్పులు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

అయితే నిజంగానే చరణ్‌కు సాయి పల్లవి ఇష్టమా లేక తనతో నటించిన హీరోయిన్లలో ఎవరి పేరైనా చెబితే లేనిపోని సమస్య వస్తుందని ఇలా చెప్పాడా అనేది ఆసక్తిగా మారింది.మొత్తానికి సాయి పల్లవి పేరు చెప్పడంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube