వరుణ్ తేజ్ లాంటి వాడైతే ఓకే అంటోన్న బ్యూటీ
TeluguStop.com
ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ సాయి పల్లవి తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.
ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.ఇక ఫిదా సినిమా టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత ఎంసీఏ, పడి పడి లేచె మనసు చిత్రాలతో తెలుగు జనాలకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ.
అటు తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ తనదైన మార్క్ వేసుకుంది.
కాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలా అనే విషయంపై ఇటీవల సాయి పల్లవి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
తనకు వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి కనిపిస్తే వెంటనే ఐలవ్ యు చెప్పేసి పెళ్లి చేసుకుంటానంది.
అయితే ఇక్కడ వరుణ్ తేజ్ అంటే హీరో కాదండోయ్.ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ చేసిన పాత్ర లాంటి అబ్బాయి కావాలని ఆమె అంటోంది.
మొత్తానికి మెలిక పెట్టి మరీ తనకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసింది ఈ బ్యూటీ.
ఇక సినిమాల పరంగా సాయి పల్లవి ప్రస్తుతం రానా దగ్గుబాటి సరసన విరాట పర్వం, నాగ చైతన్య సరసన లవ్‌స్టోరి చిత్రాల్లో నటిస్తోంది.
మరి ఈ బ్యూటీకి ఫిదా సినిమాలోని వరుణ్ తేజ్ లాంటి అబ్బాయి దొరుకుతాడా లేడా అనేది కాలమే చెబుతుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
నదియాతో ప్రేమాయణం గురించి బయటపెట్టిన సీనియర్ నటుడు సురేష్.. ఏం జరిగిందంటే?