ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి(Sai pallavi ) ఆ తర్వాత పలు సినిమా ల్లో నటించింది.ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన పాత్రల్లో మరియు సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాల్లో మేకప్ లేకుండా సహజంగా కనిపించింది.
కానీ కొన్ని సినిమా ల్లో మాత్రం పాత్ర డిమాండ్ మేరకు మేకప్ తో( Makeup ) నటించాల్సి వచ్చిందట.మేకప్ కొన్ని సినిమా ల్లో మరీ ఎక్కువ వేసిన దాఖలాలు ఉన్నాయి.
అలా ఎక్కువ మేకప్ వేయడం సాయి పల్లవికి అసలు ఇష్టం ఉండదట.సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు.
కొందరు మేకప్ వేసుకోవాలని బలవంతం చేసిన కారణంగా సినిమా కోసం మేకప్ వేసుకున్నాను.అలా మేకప్ వేసుకున్న సమయంలో చాలా బాధగా ఉంటుంది.
మేకప్ వేసుకోవడం వల్ల నన్ను నేను కోల్పోయాను అనే భాద కలుగుతుందని ఈ సందర్భంగా సాయి పల్లవి అభిప్రాయం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా( Social media )లో కొందరు తన గురించి చేస్తున్న విమర్శలకు కూడా సాయి పల్లవి సమాధానం ఇచ్చింది.
సినిమా ల్లో ఎక్కువ నటించక పోవడానికి ప్రత్యేకమైన కారణం లేదని పేర్కొంది.అయితే తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ కావాలని ఆమె కోరుకుంటుంది.ఇప్పటికే చాలా సినిమాలు చేసిన సాయి పల్లవి ప్రతి సినిమాలోని పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుంది అనే విషయం తెల్సిందే.విభిన్నమైన పాత్రలు.
ఆకట్టుకునే కథ మరియు కథనం ఉంటేనే సినిమాలు చేయాలని.అంతే కాకుండా సినిమా చేస్తే సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో తాను కాస్త మెల్లగా సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది./br>

పారితోషికం వచ్చినంత మాత్రాన తాను ఎక్కువ సినిమాలు చేయాలని ఎప్పుడు కూడా అనుకోను అంటూ చెప్పుకొచ్చింది.సాయి పల్లవి స్టార్ హీరోలతో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.కానీ కథ మరియు కథ విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.గార్గీ సినిమా తర్వాత సాయి పల్లవి తదుపరి సినిమా ఇప్పటి వరకు మొదలు అయిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.
ఈ ఏడాది లో సాయి పల్లవి వస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.