టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలకు కమిటవుతూ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ, ప్రశాంత్ నీల్, కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా గురించి రెండు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజానిజాలు తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ వార్తలు నిజమైతే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడని.
రీల్ లైఫ్ పాలిటిక్స్ లో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు కూడా ఉంటాయని ఆ డైలాగ్స్ ఒక పార్టీని టార్గెట్ చేసేలా ఉంటాయని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

ఈ రూమర్ తో పాటు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని నిజజీవిత పాత్రలో నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమాలో ఎన్టీఆర్ తల్లి పాత్ర కొన్ని నిమిషాల పాటే ఉంటుందని.త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు తల్లి పాత్ర కోసం షాలినిని రెఫర్ చేశారని వినిపిస్తోంది.వైరల్ అవుతున్న ఈ రూమర్ లో వాస్తవం తెలియాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ రోల్ లో ఇప్పటివరకు నటించలేదు.ఎన్టీఆర్ తల్లి షాలిని ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
ఈ రెండు వార్తలు నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.