చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ ఆ సినిమాతో ఆడియన్స్ ని మెప్పించగా ఆ తర్వాత హిట్ ఫస్ట్ కేస్ లో నటించి అలరించింది.ఇక డర్టీ హరిలో కూడా నటించిన అమ్మడు లేటెస్ట్ గా హర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నది రుహాని శర్మ.అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందా అన్న ప్రశ్న ఎదురైంది.దానికి రుహాని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
ఇంతవరకు ఎప్పుడు తనకు అలాంటి ఎదురు కాలేదని.అసలు అలాంటిది ఎలా అప్రోచ్ అవుతారు.అడిగిన వారు ఆ ఉద్దేశంతో అడిగారన్నది కూడా తనకు అర్ధం కాదని ఇదివరకు ఎప్పుడు తనకు అలాంటి ఎక్స్ పీరియన్స్ కలగలేదని అన్నది రుహాని శర్మ.
హర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రుహాని శర్మ సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తుంది.
గ్లామర్ షోలో తన మార్క్ చూపిస్తున్న అమ్మడు సినిమాల విషయంలో మాత్రం దూకుడు చూపించట్లేదు.
.