'ఆర్ఆర్ఆర్' జపాన్ వర్షన్.. స్టన్నింగ్ పోస్టర్ నెట్టింట వైరల్!

అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.

 Rrr Japan Special Poster Featuring Ram Charan And Jr Ntr Details, Rrr, Rajamouli-TeluguStop.com

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.

ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించు కున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.నాలుగేళ్ళ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీస్ కలెక్షన్ల ను కొల్లగొట్టింది.

ఇక రిలీజ్ అయిన అన్ని చోట్ల ఘన విజయం సాధించడంలో ఇప్పుడు ఈ బెస్ట్ ఎవర్ ఇండియన్ మల్టీ స్టారర్ సినిమాను జపనీయులు కోసం జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా జపాన్ వర్షన్ లో అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

Telugu Alia Bhatt, Japan Poster, Rajamouli, Ram Charan, Rrr Japan, Tollywood-Mov

అక్కడ ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో తెలియదు కానీ.ప్రొమోషన్స్ లో మాత్రం అక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది.

తాజాగా అక్కడ ఫేమస్ గేమ్ డిజైనర్ కొజిమ హిడియా ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ ను సరికొత్తగా డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టు కుంటుంది.ఈ స్టన్నింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ఈ పోస్టర్ ను చాలా డిఫరెంట్ స్టైల్ లో ఆయన డిజైన్ చేయడంతో అక్కడి ప్రేక్షకులను మరింత ఆకట్టు కుంటుంది.చూడాలి మరి జపాన్ లో కూడా మన ట్రిపుల్ ఆర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube