రొనాల్డో పర్సనల్ చెఫ్ శాలరీ రూ.54 లక్షలట.. అంత ఎందుకో తెలిస్తే!!

పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో గురించి తెలియని వారు ఉండరు.ఫుట్‌బాల్ ప్రపంచంలో రొనాల్డో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు.

 Ronaldo's Personal Chef Salary Is Rs. 54 Lakhs.. If You Know Why, Football Playe-TeluguStop.com

ఫుట్‌బాల్ ఉన్నంతవరకు అతడి పేరు ఉనికిలో ఉంటుందనడంలో సందేహం లేదు.గోల్స్ సాధించడం లోనే కాదు గుట్టలకొద్దీ డబ్బులు వెనక వేసుకోవడంలో కూడా అందరి ప్లేయర్ల కంటే రొనాల్డో ముందున్నాడు.

అయితే ఇప్పుడు అతడు తన సంపాదించిన డబ్బులు చాలనుకొని వాటితోనే లైఫ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు.అందుకోసం కుటుంబంతో కలిసి తన ఫరెవర్ హోమ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఈ ఇంటిలో ఒక పర్సనల్ చెఫ్‌ను నియమించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

స్టార్ ప్లేయర్ తన వైఫ్ జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి పర్సనల్ చెఫ్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నారు కానీ వారికి దొరకడం లేదు.ఈ జంట పోర్చుగల్‌లోని తమ £17 మిలియన్ల (రూ.170 కోట్ల) భవంతిలో పోర్చుగీస్ ఆహారం, అలాగే సుషీ వంటి ఇంటర్నేషనల్ ఫుడ్స్ రెండింటినీ వండగల వారి కోసం వెతుకుతున్నారు.ఒకవేళ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటే, ఆ చెఫ్‌కు నెలకు £4,500 (రూ.4,52,299) భారీ జీతం ఇవ్వనున్నారు.అంటే సంవత్సరానికి రూ.54 లక్షలు.ఈ ప్యాకేజీ పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా ఉండదని చెప్పవచ్చు.

క్రిస్టియానో ​​రొనాల్డో పోర్చుగల్‌లోని క్వింటా డా మారిన్హాలో ఒక డ్రీమ్ హోమ్ కట్టించుకుంటున్నాడు.ఈ ఇంటి కోసం 2021లో భూమిని కొన్నాడు.ఆ ఇంటి నిర్మాణం 2023, జూన్ నాటికి పూర్తవుతుంది.

ఈ ఫుట్‌బాల్ కింగ్ ప్రస్తుతం రియాద్ మధ్యలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్‌లోని ఒక సూట్‌లో ఉంటున్నాడని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube