గుంటూరు: ఉండవల్లి లో నిబంధనలు పాటించని ఓ సినిమా థియేటర్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు.ఉండవల్లి సెంటరు లోనీ శ్రీ రామకృష్ణ సినిమా హాల్ లో ప్రభుత్వ నిబంధనలు కు వ్యతిరేకంగా గురువారం విడుదలైన అఖండ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించారని అభియోగం పై అధికారులు సినిమా హాల్ ను సీజ్ చేశారు.
హాల్ నిర్వాహకులు వారు అనుమతి పొందిన సమయం కంటే ముందుగానే సినిమా ను ప్రదర్శించినా స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని వార్తలు రావడంతో కొట్టడం తో స్పందించిన తాసిల్దార్ శ్రీనివాసులు రెడ్డి.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు మేరకు మండల తాసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, పోలీసు బందోబస్తు మధ్య సినిమా హాల్ సీజ్.
తదుపరి ఆదేశాల వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని నిర్వాహకులు ను ఆదేశించారు.ఇప్పటికే బుకింగ్, ఆన్లైన్ లో టికెట్ లు కొనుగోలు చేసిన వారికి నగదు వాపసు ఇవ్వనున్నట్లు తెలిపిన థియేటర్ నిర్వాహకులు.