కాంగ్రెస్ లో మళ్లీ మొదలు !  చిచ్చు రేపిన రేవంత్ !

తెలంగాణ కాంగ్రెస్ లో ( Telangana Congress ) పరిస్థితి చక్కబడిందని, పార్టీ నాయకులంతా గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం సంతోషించే లోపే అనూహ్యంగా చోటుచేసుకున్న ఓ పరిణామం మళ్లీ యథాస్థితికి తెలంగాణ కాంగ్రెస్ ను తీసుకురాబోతోంది అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వైఖరిని తప్పుపడుతూ , ఆయనపై ప్రత్యక్షంగాను , పరోక్షంగాను విమర్శలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సీనియర్లు గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు పార్టీ అధికారంలోకి వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అయితే కొద్దిరోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకం పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు .24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ మాట్లాడిన రేవంత్ వ్యవసాయానికి మూడు నుంచి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుంది అంటూ మాట్లాడారు .

 Revanth Reddy Comments Raise Heat In Telangana Congress Party Details, Revanth R-TeluguStop.com
Telugu Aicc, Congress, Mla Seethakka, Pcc, Revanth Reddy, Seethakka Cm, Sithakka

అంతేకాకుండా తెలంగాణకు సీతక్క( MLA Seethakka ) సీఎం అవుతారు అంటూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి .ఈ వ్యాఖ్యలపై సీనియర్లు రేవంత్ పై ఫైర్ అవుతున్నారు.ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.అమెరికా పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ తానా సభలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా సీతక్క సీఎం అవుతారు అని , 24 గంటల విద్యుత్ అవసరం లేదని మాట్లాడారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో వివాదనికి కారణం అయ్యాయి.

సీఎం పదవి కోసం ఎంతోమంది సీనియర్లు పోటీలో ఉండగా , రేవంత్ రెడ్డి ఏకపక్షంగా సీతక్క పేరును ఏ విధంగా ప్రకటిస్తారని కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.అసలు అధిష్టానం నిర్ణయం తీసుకోకుండానే రేవంత్ ఏ విధంగా ప్రకటన చేస్తారని మండిపడుతున్నారు.

Telugu Aicc, Congress, Mla Seethakka, Pcc, Revanth Reddy, Seethakka Cm, Sithakka

అదేవిధంగా రైతులకు ఆగ్రహం కలిగించే విధంగా విద్యుత్ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఉచిత విద్యుత్ అంశంలో రేవంత్ తేనె తుట్టు కదిపారు అని,, కాంగ్రెస్ బలం పెంచుకుందని, బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి అధికారంలోకి రాగలరని నమ్మకం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సమయంలో, రేవంత్ వ్యాఖ్యలు బాగా డామేజ్ చేస్తాయనే భయము తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.సీతక్క , ఉచిత విద్యుత్ అంశంపై సీనియర్లు రేవంత్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .గత కొంతకాలంగా  సొంత నిర్ణయాలు తీసుకుంటూ , పార్టీ హైకమాండ్ కు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని ,ఆయనను కట్టడి చేయకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు హైలెట్ చేస్తున్నారు.ఇప్పుడు ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube