అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US presidential election ) కీలక పరిణామం చోటు చేసుకుంది.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ పడుతున్న సౌత్ కరోలినా( South Carolina ) సెనేటర్ టిమ్ స్కాట్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నిలిపిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
థర్డ్ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు.‘‘ మే 22 కంటే ఇవాళ తాను అమెరికాను ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
కానీ తాను తిరిగి అయోవాకు వెళ్లేటప్పుడు అధ్యక్ష అభ్యర్ధిగా వుండను.ఎందుకంటే నా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నానని టిమ్ స్కాట్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో తాను మరొక రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధికి మాత్రం మద్ధతు ఇచ్చేది లేదని టిమ్ స్పష్టం చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా వుండే ఆలోచన లేదని, తన లక్ష్యం అధ్యక్ష పదవేనని ఆయన తేల్చిచెప్పారు.తనను పరిగెత్తడానికి పిలిచారని అనుకుంటున్నానని, అంతే తప్ప గెలవడానికి పిలవలేదని టిమ్ స్పష్టం చేశారు.ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నేను చేయాల్సిన పనుల జాబితాలో వైస్ ప్రెసిడెంట్ కావడం అనేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
వైట్‌హౌస్ బిడ్‌ను ప్రారంభించడానికి మరో అవకాశం కోసం ప్రయత్నిస్తానని టిమ్ స్కాట్( Tim Scott ) చెప్పారు.ఈ భూమ్మీద ఓటర్లు గొప్ప వ్యక్తులని.వారిని ఎప్పుడూ గౌరవిస్తానని, కష్టపడి పనిచేస్తూనే వుంటానని ఆయన పేర్కొన్నారు.

అయితే ఆయన ఆకస్మాక ప్రకటనతో సహాయకులు, ప్రచార సిబ్బంది, దాతలు షాక్ అయ్యారు.కానీ టిమ్ స్కాట్( Tim Scott ) నిర్ణయం వెనుక పలు కారణాలు వున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ముఖ్యంగా గత అక్టోబర్‌లో టిమ్‌కు అండగా వుంటున్న సూపర్ పీఏసీ.
టెలివిజన్ ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది.మూడవ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత కొత్తగా పెట్టుబడి పెట్టకూడదని నిర్ణయించుకుంది.
అలాగే ప్రెసిడెన్షియల్ డిబేట్ సందర్భంగా ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదంపై అమెరికాలోని కాలేజ్ క్యాంపస్‌లలో పెరుగుతున్న యూదు వ్యతిరేకత గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.కళాశాల అనేది ఒక ప్రత్యేక హక్కని.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి విద్యార్ధులను అనుమతించే విశ్వవిద్యాలయాల నుంచి ఫెడరల్ నిధులను వెనక్కి తీసుకుంటానని టిమ్ స్కాట్ హెచ్చరించారు.యూదులపై మారణహోమాన్ని ప్రోత్సహిస్తున్న వీసాలపై వున్న విద్యార్ధులను క్యాంపస్‌ల నుంచి బహిష్కరిస్తానని వ్యాఖ్యానించారు.