టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో విక్రమ్ కే కుమార్( Vikram K Kumar ) ఒకరు.ఈయన తీసిన సినిమాలన్నీ ఒక క్లాసిక్ సినిమాలుగా మిగిలి పోయాయి.
ఒక మనం.ఒక 24 సినిమా.ఇలా ఈయన సినిమాలో కథాంశం ను మలచిన తీరు ప్రేక్షకులను ఆకట్టు కుంది.అయితే విక్రమ్ ఈ మధ్య తన సినిమాల్లో కొత్తదనం చూపించక పోవడంతో ఈయన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.
ఈయన గత సినిమా థాంక్యూ( Thank you ) ఏ రేంజ్ లో ప్లాప్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోగా నటించిన థాంక్యూ సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.
వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూకు థాంక్యూ నుండి ప్లాపుల పరంపర కొనసాగుతుంది.దీంతో చైతూ రేసులో వెనుకబడి పోయాడు.
ఈయన కంటే కుర్ర హీరోలు కూడా హిట్స్ కొడుతూ పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు.చైతన్య మాత్రం వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.మరి థాంక్యూ సినిమాతో పాటు ఇదే కాంబోలో మరో ప్రాజెక్ట్ తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే ఇది మాత్రం వెబ్ సిరీస్ కావడం విశేషం.
నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలోనే ”దూత”( Dhootha Web Series ) అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ థాంక్యూ ప్లాప్ కారణంగా ఇప్పటి వరకు రిలీజ్ కు రెడీ కాలేక పోయింది.ఇక ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ కు డేట్ ఫైనల్ చేసినట్టు టాక్ వైరల్ అయ్యింది.డిసెంబర్ 1, 2023 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుందట.
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో( Amazon Prime Video ) ఈ వెబ్ సిరీస్ దూత ప్రసారం కాబోతుంది.ఈ డేట్ గురించి అతి త్వరలోనే మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇవ్వబోతున్నారు.
మనం, థాంక్యూ వంటి సినిమాల తర్వాత ఈ కాంబో ఇప్పుడు హిట్ అందుకుంటుందో ప్లాప్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.పార్వతీ, ప్రియా భవాని శంకర్ కీలక రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.