ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింగిల్ బెంచ్ విచారణకు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సింగిల్ బెంచ్ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.

 Rejection Of Single Bench Trial In Mla Baiting Case-TeluguStop.com

ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏజీ కోరగా.హైకోర్టు నిరాకరించింది.

డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టదని స్పష్టం చేసింది.డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది.

ఈ విషయంలో సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేసు విచారణలో సీబీఐకి అడ్డంకులు తొలగిపోయాయి.

దీంతో ఏ క్షణమైనా అధికారులు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.కేసు ఫైల్స్ ను అప్పగించాలని నిన్న తెలంగాణ సీఎస్ కు సీబీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా కేసు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సీబీఐ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube