ఎమ్మెల్యేలకు ఎర కేసులో సింగిల్ బెంచ్ విచారణకు నిరాకరణ

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సింగిల్ బెంచ్ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.

ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏజీ కోరగా.హైకోర్టు నిరాకరించింది.

డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ చేపట్టదని స్పష్టం చేసింది.డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది.

ఈ విషయంలో సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది.హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేసు విచారణలో సీబీఐకి అడ్డంకులు తొలగిపోయాయి.

దీంతో ఏ క్షణమైనా అధికారులు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.కేసు ఫైల్స్ ను అప్పగించాలని నిన్న తెలంగాణ సీఎస్ కు సీబీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా కేసు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సీబీఐ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశారు.

అలా పిలిస్తే మాత్రమే బాలకృష్ణకు ఇష్టం.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!