ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల కూటమి అధికారంలోకి వస్తుందని 120 నుంచి 130 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని నేతలు భావించగా ఎన్నికల సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.ఏపీలో పొత్తు చిత్తు అవ్వడం వెనుక అసలు కారణాలు టీడీపీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జగన్ సభలకు రికార్డ్ స్థాయిలో జనం హాజరవుతుండగా చంద్రబాబు సభలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి.
ఏపీలో బీజేపీ( BJP )కి కేవలం 0.5 శాతం ఓట్లు ఉన్నాయి.ఆ పార్టీ కోసం టీడీపీ, జనసేన చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఆ స్థానాలలో వైసీపీ పెద్దగా ప్రచారం లేకుండానే విజయం సాధించే పరిస్థితులు అయితే ఉన్నాయి.మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన రోజుల కంటే ఆయన ఆరోగ్య సమస్యల వల్ల రెస్ట్ తీసుకుంటున్న రోజులే ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
చంద్రబాబు ప్రకటించిన హామీలను ప్రజలు నమ్మకపోవడం, ఉచిత హామీలకు బీజేపీ వ్యతిరేకం కావడం కావడంతో కూటమి ఇచ్చిన హామీలను సైతం ఏపీ ప్రజలు నమ్మట్లేదు.వైసీపీతో పోలిస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని బాబు ఎంత చెబుతున్నా మాకు నమ్మకం లేదని ఓటర్లు చెబుతున్నారు.సంపద సృష్టిస్తామని బాబు చెబుతుండగా 2014 నుంచి 2019 వరకు ఎందుకు సంపద సృష్టించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం కూటమికి చేటు చేస్తోంది.
కూటమి అధికారంలోకి రావడం సులువు కాదని ఆ పార్టీ నేతలే కామెంట్లు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప ఏపీలో కూటమి అధికారంలోకి రావడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ మాత్రం విజయం విషయంలో ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.