ఇళయరాజా ( Ilayaraja )సంగీత విద్వాంసుడు.సంగీత విజ్ఞాని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంగీతం చచ్చిపోతున్న రోజుల్లో ఈయన ఎంట్రీ అదొక సంచలనం.ఈయన కట్టిన బాణీలు, పాటలు నేపథ్య, సంగీతం అన్నీ కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.
సంగీత బ్రహ్మగా ఇళయరాజాను లక్షల మంది ప్రేమించారు.ఆయన స్వరాలు పలికిస్తే తెలుగు ప్రజలు ఆ మత్తులో నిద్ర పోయారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ సంగీతం వేరు .వ్యక్తిత్వం వేరు అనే విషయాన్ని అందరం గుర్తు పెట్టుకోవాలి.ఆయన పాటల విషయంలో గొప్ప వ్యక్తి అయితే అయి ఉండొచ్చు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి.ఇప్పటి వరకు ఆయన ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నాడో లెక్క లేదు.
ఇళయరాజా కి ఎలాంటి ఒక సంస్థ కూడా లేని సమయంలో చెన్నైలో ప్రసాద్ స్టూడియో( Prasad Studio in Chennai ) వారు ఆయనకు ఒక గది ఇచ్చి ట్యూన్స్ కట్టుకోమని చెప్పినంత మాత్రాన అది తనదే అన్నట్టుగా అప్పట్లో కోర్టుకెక్కడు.దాంతో కోర్టు ఇళయరాజా కి మొట్టికాయలు వేసింది.ఎస్పీ బాలు స్టేజ్ పై ఇళయరాజా పాటలు పాడితే వాటికి రాయల్టీ కావాలంటూ ఆయనతో వివాదం పెట్టుకున్నాడు.తన పర్మిషన్ లేకుండా తన పాటలను ఎవరు ఎక్కడ వాడకూడదు అనేది ఇళయరాజా వాదన.
ఇక ఒకేసారి ఆరుగురు నిర్మాతలు ఆయనపై మొన్న ఆ మధ్య కేసు వేశారు.ఇది రాయల్టీ విషయంలోనే జరిగింది.ఇప్పటి వరకు ఇళయరాజా వెయ్యి సినిమాలకు పైగా పని చేసి 4500 పాటలకు పని చేశాడు.
అయితే ఆయన సంగీతం చేసి పెట్టింది డబ్బు తీసుకునే కదా.ఒకసారి చేశాక అది పూర్తిగా నిర్మాతకు వదిలేయాలి.డబ్బులు ఖర్చు పెట్టి ఒక నిర్మాత( Producer ) సినిమాను నిర్మిస్తున్నాడు అంటే దానికి పూర్తి బాధ్యుడు ఆధ్యుడు ఆయనే అయి ఉండాలి.
ఇలా పని చేసిన ప్రతి ఒక్కరూ రాయల్టీ కావాలంటే ఎలా కుదురుతుంది.డైరెక్టర్ అయిన సినిమాటో గ్రాఫర్ అయినా కొరియోగ్రాఫర్ అయినా నటి నటులైన డబ్బు తీసుకున్నమా వారి పని చేసామా అన్నట్టుగానే ఉండాలి.
కానీ ప్రతి ఒక్కరూ తమ పర్మిషన్ లేనిదే వారికి సంబంధించిన ఆ బిట్స్ ఎక్కడ వాడకూడదు.వారి ఆ పాటలను ప్లే చేయకూడదు అంటే ఎలా కుదురుతుంది.
ఇప్పుడు నిర్మాతలు అందరూ ఈ విషయంపై గట్టిగానే నిలబడుతున్నారు.ఫ్రీగా చేసి పెడితే వారి పర్మిషన్ కావాలి కానీ డబ్బు తీసుకొని పని చేశాక దానిపై కూడా అజమాయిషి ఏంటి అంటూ అందరూ ఏకతాటిపై నిలబడి ఇళయరాజ వంటి వారికి కోర్ట్ చుట్టూ తిరిగే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
జడ్జి కోర్టులో అడిగిన ప్రశ్నకు ఇళయరాజా దేవుడు కన్నా గొప్పవాడు కాదు కదా అని అనగానే అహం పూర్తిగా దెబ్బతిన్న ఇళయరాజా ఇకనైనా కోట్లు చుట్టూ తిరగడం మానుతాడా చూడాలి.