సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఆనిమల్ సినిమా తర్వాత ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నాడు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్నాక విమర్శలు చాలా కామన్.
మామూలుగా క్రియేటివ్ ఫీల్డ్ వారికి ఇలాంటి విమర్శలు తప్పవు.అయితే బయట వారు విమర్శించడం సహజమే కానీ ఇండస్ట్రీలో ఉండేవారు ఎప్పుడు విమర్శించడానికి అంత తొందరగా ముందుకు రారు.
ఎందుకంటే తర్వాత రోజుల్లో అవకాశాలు రావు అని లేదంటే మనం చేసే పని పై కూడా పక్క వారు కామెంట్ చేస్తారు అనే భయం ఉంటుంది.దాంతో ఇండస్ట్రీ వారు కామెంట్ చేసే స్థాయికి ఒక మనిషి వెళ్ళాడు అంటే అది ఖచ్చితంగా లిమిట్ దాటిపోయిందని మనం అర్థం చేసుకోవాలి.
సందీప్ రెడ్డి వంగా అనిమల్ సినిమాను చాలామంది డైరెక్ట్ గానే దుమ్మత్తి పోశారు.
రచయిత జావేద్ అక్తర్, కొంకణ సింగ్, కంగనా రనౌత్, కిరణ్ రావు లాంటివారు ఈ సినిమాపై అభ్యంతర వ్యక్తం చేశారు.సినిమాలో నటించిన ఆదిల్ హుస్సేన్( Adil Hussain ) సైతం అందులో ఎందుకు నటించానా అని బాధపడ్డాడు.అయితే అందరికీ కౌంటర్స్ ఇచ్చాడు సందీప్.
ఇక ఆదిల్ కి గట్టిగానే ఇచ్చి పడేసాడు.నిన్ను సినిమాల తీసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు.
నిన్ను తీసేసి నీ పోర్షన్ మొత్తం ఏఐ చేసి పెట్టేస్తాను అంటూ విపరీతంగా విరుచుకుపడ్డాడు.గతంలో ఎప్పుడూ కూడా ఇండస్ట్రీ వారు ఇలా తమలో ఒక వ్యక్తిని కించపరిచింది లేదు.
ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ ని చోటా కె నాయుడు ఏదో అన్నాడని బహిరంగ లేఖ పెట్టాడు హరీష్ శంకర్.అయితే తన పనికి మాటిమాటికి అడ్డుపడుతున్నాడు అన్నది చోటకే నాయుడు వాదన.
పదేళ్ల క్రితం జరిగిన సినిమాలో నిన్ను తీసి పారేద్దాం అనుకున్నాను అంటూ హరీష్ బహిరంగగా లేఖ రాయడం సంచలనం సృష్టించింది.ఇలా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మాట్లాడితే వారికి కౌంటర్ ఇవ్వడం అనేది ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది.కానీ ఇండస్ట్రీ వారిని ఇండస్ట్రీలోని వారు ఇలా కించపరుచుకుంటూ వెళ్లడం అనేది ఖచ్చితంగా మంచి పరిణామం అయితే కాదు.గతంలో సౌత్ సినిమా ఇండస్ట్రీపై రాధిక ఆప్టే సైతం ఇలాగే మండిపడింది.
రాఘవేంద్రరావు సినిమాపై తాప్సి( Taapsee Pannu ) సైతం ఇదే రేంజ్ లో ఫైర్ అయింది.వీరికి ఆ తర్వాత రోజుల్లో అవకాశాలు రావు అన్న భయం లేదు కాబట్టి అలా నోటికొచ్చిన కామెంట్స్ చేశారు.
ఏదైనా నచ్చకపోతే గతంలో సినిమా నుంచి బయట కూడా వచ్చేవారు కాదు.కానీ ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ అనే పేరుతో బయట కూడా వచ్చేస్తున్నారు.ఇక నిన్న మొన్న దిల్ రాజు నీ తట్టుకొని హనుమాన్ సినిమా నిలబడిన విధానం కూడా అచ్చం ఇలాంటిదే.