అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.రైతులు ఎవరు అధైర్య పడవద్దు.
కాంగ్రెస్ పార్టీ( Congress party ) మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతులు( Farmers ) ఎవరు కూడా అధైర్య పడవద్దని అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలు ధీమాగా ఉండాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి( Saddi Lakshmareddy ) అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తడిసిన ధాన్యాన్ని,మొలకలు వచ్చిన ఈ చివరి గింజ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందని అన్నారు.
రైతులు ధీమాగా ఉండి తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, బండారి బాల్రెడ్డి, మందాటి దేవేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







