పచ్చి ఆహారాలను తినటం వలన కలిగే నష్టాలు

ఈ రోజుల్లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలు మరియు బరువు కారణంగా రకరకాల డైట్స్ ని ఫాలో అవుతున్నారు.దాంతో చాలా మంది పచ్చి ఆహారాలను తినటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

 Raw Food Diet Side Effects , Raw Food , Acid Alkaline Balance, Stones In The Gal-TeluguStop.com

ఈ పచ్చి ఆహారాల డైట్ లో పచ్చి ఆహారాలను మాత్రమే తీసుకుంటారు.అయితే ఇలా పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన కొన్ని లాభాలు ఉంటాయి.

అలాగే కొన్ని నష్టాలు ఉంటాయి.ఇప్పుడు పచ్చి ఆహారాలను తినటం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఈ డైట్ కారణంగా శరీరంలో PH స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.ఎక్కువ మోతాదులో పచ్చి ఆహారాలను తీసుకోవటం వలన “యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్” మీద ప్రభావం చూపి రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

దాంతో కొన్ని రకాల ఇన్ఫె క్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందువల్ల ఈ డైట్ ని ఫాలో అయ్యేవారు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు, ఇతర పిత్తాశయ వ్యాధులతో బాధపడుతున్న వారు,గుండె జబ్బులు ఉన్నవారు అసలు ఈ డైట్ జోలికి వెల్ళకూడదు.ఎందుకంటే ఈ డైట్ కారణంగా ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.

పచ్చి ఆహారాలను తినటం వలన ఈ ఆహారాలు అలవాటు అయ్యిపోయి మాములు ఆహారాలలో కొన్నింటిపై తినాలనే కోరిక తగ్గిపోతుంది.అప్పుడు ఆ ఆహారాల కారణంగా వచ్చే పోషకాలు మన శరీరానికి అందవు.

ఈ డైట్ ని ఫాలో అవ్వాలని అనుకున్నపుడు డాక్టర ని సంప్రదించాలి.అలాగే దీర్ఘ కాలం పాటు కొనసాగించకూడదు.

Raw Food Diet Side Effects

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube