శుక్రవారం విడుదలైన సినిమాలలో బింబిసారా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా, వశిష్ట్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
కొత్త కుర్రాడైనా సరే వశిష్ట్ ఈ సినిమాని చాలా చక్కగా హ్యాండిల్ చేసి సినిమాని అద్భుతమైన విజువల్ వండర్ గా మార్చాడు.ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కి సైతం చాలా రోజుల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో పడిందని అనుకోవచ్చు.
ఈ విజయం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మరోవైపు దుల్కర్ సల్మాన్ సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా దానికి పోటీగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాని ప్రేక్షకుల ముందుకి వదిలాడు.
అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బింబిసారా సినిమాకి మొదట అనుకున్నది కళ్యాణ్ రామ్ ని కాదట.కళ్యాణ్ రామ్ పాత్ర కోసం తొలుత మరొక హీరో దగ్గరికి వెళ్ళగా, ఆ హీరో రిజెక్ట్ చేయడంతో చివరికి ఆ కథ కళ్యాణ్ రామ్ ని వరించిందట.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ.

కథ అంతా సిద్ధం చేసుకుని వశిష్ట్ రవితేజ దగ్గరికి వెళ్ళగా, అసలు తను ఈ కథకు సూట్ కానని, అలాంటి పాత్రలు చేయలేనని చెప్పాడట.అంతేకాదు వశిష్ట్ లాంటి కొత్త దర్శకుడు ఇంత విజువల్ వండర్ సినిమాని హ్యాండిల్ చేయలేడేమో అని రవితేజ అభిప్రాయపడ్డాడట.దాంతో అదే కథతో కళ్యాణ్ రామ్ దగ్గరికి దర్శకుడు విశిష్ట్ వెళ్లాడట.
కళ్యాణ్ రామ్ కి సొంత గ్రాఫిక్స్ స్టూడియో తో పాటు సినిమా ప్రొడక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ చేతిలోకి వెళ్ళింది.ఆ తర్వాత ఆ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో ఎలాంటి విజయం సాధించిందో మనందరం చూస్తూనే ఉన్నాం.
ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వశిష్టి కోసం చాలామంది నిర్మతలు క్యూ కడుతూ ఉండడం విశేషం.