కుంబ్లే రికార్డుకు ఎసరు పెడుతున్న అశ్విన్!

BGT బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్టులో మరోసారి భారత బౌలర్లు ఆసీస్ ను తక్కువ స్కోరుకి పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో షమీ 4 వికెట్లతో చెలరేగగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తలా 3 వికెట్లు తీసి ఆసీస్ భారీ స్కొరు చేయకుండా అడ్డకట్ట వేశారు.

 Ravichandran Ashwin Take 100 Wickets In Border Gavaskar Trophy, , Anil Kumble,-TeluguStop.com

ఈ మ్యాచ్ లో అశ్విన్ 3 కీలక వికెట్లు తీసి ఆసీస్ కు ఝలక్ ఇచ్చాడు.ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్.

ఒకే ఓవర్లో లబూషేన్, స్టీవ్ స్మిత్ లను పెవిలియన్ కు పంపాడు.ఆ తర్వాత వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఔట్ చేశాడు.

ఇక అశ్విన్ అయితే ఈ నేపథ్యంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు.క్యారీని ఔట్ చేయడం ద్వారా BGTలో వంద వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే అశ్విన్ కంటే ముందంజలో వున్నాడు.ఇకపోతే కుంబ్లే.ఆస్ట్రేలియాతో 20 టెస్టులు అడగా 111 వికెట్లు పడగొట్టాడు.అత్యుత్తమ ప్రదర్శన విషయానికి వస్తే, 8-141.బీజీటీలో కుంబ్లే.పదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.

ఇక BGTలో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్న కుంబ్లేను దాటడం అశ్విన్ కు పెద్ద కష్టమేమీ కాదని యిట్టె అర్ధం అయిపోతుంది.కాగా ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే ఆలౌట్ కావడం కొసమెరుపు.ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు చేయగా మిడిలార్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ 72 (నాటౌట్)గా నిలిచాడు.ఇక ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్ 33 మాత్రమే కొట్టాడు.

ICC టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ వన్ (లబూషేన్-18), నెంబర్ టూ (స్మిత్-0) లు దారుణంగా విఫలమయ్యారు.ఈ ఇద్దరినీ అశ్విన్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube