కుమ్మేస్తున్న మాస్ రాజా.. 'టైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా అన్ని కోట్లట!

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja )కు కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చినప్పటికీ ఆయన సినిమాలకు హైప్ మాత్రం ఏ మాత్రం తగ్గదు అనే చెప్పాలి.ఇక క్రాక్, ధమాకా వంటి హిట్స్ తర్వాత మాస్ రాజా వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya )వంటి హిట్ కూడా అందుకున్నాడు.

 Ravi Teja Tiger Nageswara Rao Business,tiger Nageswara Rao, Tiger Nageswara Rao-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే మాస్ రాజా మరో సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచారు.

రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమాను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నాడు.మరి రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు’‘.( Tiger Nageswara Rao ) నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండే వరుస ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటూ అంచనాలు పెంచేశారు.ఇక ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.>

ఈ టీజర్ తర్వాత టైగర్ పై మరింత హైప్ పెరగడంతో మార్కెట్ లో ఈ సినిమా హక్కులకు కూడా భారీ డిమాండ్ పెరిగింది.

దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తుంది అనే చెప్పాలి.ట్రైలర్ కూడా రాకుండానే టీజర్ చూసి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.టైగర్ తెలుగు వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 30 కోట్ల బిజినెస్ జరుగగా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్…

ఇలా టీజర్ తోనే అంచనాలు పెంచేసుకుని భారీ బిజినెస్ చేసుకుని రంగంలోకి దూకడానికి మాస్ రాజా సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమాలో నుపుర్ సనన్, ( Nupur Sanon )గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే జివి ప్రకాష్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే ఈ సినిమాను అగర్వాల్ ఆర్ట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్( renu desai ) జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube