విజయ్ - రష్మక లవర్స్ అనడానికి.. ఈ రెండు కారణాలు చాలవా?

చిన్నాచితకా పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీయెస్ట్ హీరో గా కొనసాగుతున్నాడు.కేవలం ఒక సినీ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ సినిమా హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ పేరు చెబితే సిగ్గుతో మెలికలు తిరిగి పోతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Rashmika Vijay Love Story Rashmika , Vijay, Tollywood, Gita Govindam, Dear Comra-TeluguStop.com

అంతలా తన సినిమాలతో తన ఆటిట్యూడ్తో మిగతా హీరోల కంటే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.పెళ్లి చూపులు సినిమా తో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లైగర్ వరకు పయనం సాగించాడు.

విజయ్ దేవరకొండ కెరియర్లో అర్జున్ రెడ్డి సినిమా కెరీర్ ని మలుపు తిప్పితే.ఇలా మలుపు తిరిగినా కెరియర్ నిలబెట్టింది గీత గోవిందం సినిమా.ఈ సినిమాలో రష్మిక మందన విజయ్ దేవరకొండ జోడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.అయితే గీత గోవిందం సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో మరోసారి కలిసి నటించింది ఈ జంట.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లిప్లాక్ సన్నివేశాలు అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పారు.అర్జున్ రెడ్డి సినిమాలో శాలిని పాండే తో డీప్ రొమాన్స్ కన్నా ఇక గీతగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలోని పెదవి ముద్దులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Dear Comrade, Gita Govindam, Liger, Pushpa, Tollywood-Latest News - Telug

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్ బయటకు రావడానికి కొన్ని సంఘటనలు కూడా జరిగాయి.హిందీ సినిమాల కోసం రష్మిక ముంబై వెళ్ళినప్పుడల్లా విజయ్ దేవరకొండ రష్మిక కలుసుకుంటున్నారు.మరో వైపు లైగర్ షూటింగ్ సమయంలో రష్మిక ను కలిసిన విజయ్ దేవరకొండ కలిసి డిన్నర్ చేసి రోడ్లమీద కనిపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

దీంతో వీరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.అయితే రష్మిక ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని కెరీర్ కోసం క్యాన్సల్ చేసుకుంది.రౌడీ హీరో అంతదూరం ఇప్పటివరకు వెళ్ళనే లేదు.మరి చివరకు ఈ జోడి పయనం ఎక్కడ వరకు ఉంటుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube