ఇకపై జబర్దస్త్ కార్యక్రమానికి ఏకఛత్రాధిపత్యంగా ఏలనున్న రష్మి..?

బుల్లితెరపై కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం మొదట్లో కేవలం జబర్దస్త్ కార్యక్రమం ఒకటే ప్రసారం అవుతూ ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించేవారు.

 Rashmi Gautam Is The Only Anchor Of Jabardasth And Sridevi Drama Company , Rashm-TeluguStop.com

ఇలా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.అయితే అనసూయ ప్రెగ్నెంట్ కావడంతో ఈమె ఈ కార్యక్రమం నుంచి కొద్ది రోజుల పాటు తప్పుకోవడంతో ఈ కార్యక్రమాన్ని రష్మి యాంకరింగ్ చేసింది.

అనంతరం తిరిగి ఈ కార్యక్రమానికి అనసూయ రావడంతో రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ అప్పటినుంచి ఈ కార్యక్రమం వారంలో రెండు రోజులు ప్రసారం అవుతూ ఉంది.

Telugu Anasuya Anchor, Jabardasth, Rashmiextra, Rashmi Gautham, Sridevi, Tollywo

ఈ విధంగా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రసారం కాగా జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా కొనసాగుతున్నారు.అయితే చాలా సంవత్సరాలకు తిరిగి రష్మీ ఈ కార్యక్రమానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జబర్దస్త్ కార్యక్రమం నుంచి పలువురు కమెడియన్స్ తప్పుకున్నారు.

అయితే వీరికి సినిమా అవకాశాలు రావడం వల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Anasuya Anchor, Jabardasth, Rashmiextra, Rashmi Gautham, Sridevi, Tollywo

ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది.ఈ విధంగా రష్మి జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగడమే కాకుండా తిరిగి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

అనసూయ, సుధీర్ వంటి వాళ్ళు తప్పుకోవడంతో రష్మీ ఈ కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకొని దూసుకుపోతున్నారు.ఇకపోతే గత రెండు మూడు వారాల నుంచి ఈమె ఆటో రాంప్రసాద్ స్కిట్ లో తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube