టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఫిదా చేసింది.
అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.
ఆ తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.
ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తను సన్నబడ్డాక.ఫోటోలతో బాగా రెచ్చిపోయింది.
బికినీ లో కూడా ఓ షాక్ ఇచ్చింది.ఇక బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా కావటానికి కారణమేంటంటే గతంలో సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో అలా సన్నబడింది.దీంతో తన అందాలను సోషల్ మీడియా వేదికగా అందరికీ మరోసారి పరిచయం చేసింది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.ఈ మధ్య కాస్త బొద్దుగా తయారవ్వగా కాస్త అందంగా కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.కానీ దర్శక నిర్మాతలు ఈ అమ్మడిని మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.
కానీ సన్నబడ్డాక ఆమెకు అవకాశాలు రాలేకపోయాయి.పాపం ఎంతో కష్టపడి సన్నబడిన రాశి కి ఇప్పుడైతే నిరాశ అని చెప్పవచ్చు.
పైగా కొత్త హీరోయిన్ల లిస్ట్ చేరటంతో ఈ అమ్మడును పెద్దగా పట్టించుకునే దర్శక నిర్మాతలు లేరు.ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తాజాగా కొన్ని ఫోటోషూట్ లు చేయించుకోగా వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.అందులో తను చాలా ఫిట్ గా, సన్నగా కనిపించింది.తన చూపులతో బాగా మత్తెక్కించింది.
తాను వేసుకున్న డ్రెస్ లో చాలా క్యూట్ గా అనిపించింది.ఇక ఫోటోలు చూసి తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.చాలా అందంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ బ్యూటీ ఇప్పుడు ఎంత గ్లామర్ షో చేసినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం తక్కువగానే వస్తున్నాయని చెప్పాలి.ప్రస్తుతం ఓ సినిమాలో ఈ బ్యూటీ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.