నెపోటిజం.ఈ మాట గత కొద్దీ సంవత్సరాలుగా వినిపిస్తుంది.
ఈ మాట మన టాలీవుడ్ లో కంటే ఎక్కువుగా బాలీవుడ్ వినిపిస్తుంది.అక్కడ నెపోటిజం బాగా చూపిస్తారని చెప్పుకుంటారు.
ఈ నెపోటిజం వల్ల టాలెంట్ ఉన్న వాళ్లకు కూడా అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.మరి కొంతమంది నిరూపించుకున్న ఆ తర్వాత అవకాశాలు లేకుండా చేయడంతో చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా వచ్చాయి.
ఈ కారణంగానే బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి టాలెంటెడ్ నటుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు.సుశాంత్ మరణంతో నెపోటిజం పేరు బాగా వినిపించింది.
స్టార్ గా ఎదుగుతున్న అతడిని తొక్కేశారంటూ వార్తలు వచ్చాయి.అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ నెపోటిజం పై చర్చలు జరుగుతున్నాయి.
ఇండియన్ సినిమాల్లో గత రెండు సంవత్సరాలుగా బంధుప్రీతి ఎక్కువ అవుతుందని బలంగా వినిపిస్తుంది.
ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపారు.
అయితే తాజాగా నెపోటిజం పై దగ్గుబాటి రానా కూడా స్పందించారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రానా నెపోటిజం పై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.నెపోటిజం అంటే రాజకీయ లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని.సినీ రంగానికి ఇది వర్తించదని తెలిపాడు.

సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారు మాత్రమే రాణిస్తారని.ఇక్కడ పెద్ద కుటుంబం, పేరున్న కుటుంబం వంటివి లెక్కచేయరనే చెప్పారు.ఇక్కడ ప్రతి ఒక్కరు తమని తాము నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడతారని లేదంటే ఇక్కడ రాణించడం కష్టం అని చెప్పారు.ఈ వ్యాఖ్యలతో సినీ రంగంలో నెపోటిజం కి చోటు లేదని చెప్పుకొచ్చారు.
ఇక రానా ప్రెసెంట్ భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.విరాట పర్వం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.