రామోజీరావు మృతికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి( Sri Sri Sri Tridandi Chinnajeer Swami ) సంతాపం తెలిపారు.తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు చిరునామా శ్రీమాన్ రామోజీరావు అని పేర్కొన్నారు.
తెలుగు భాషను సుసంపన్నం చేసి, తెలుగు వారి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన రామోజీరావు నిష్క్రమణ తెలుగు వారికి తీరని లోటని తెలిపారు.తెలుగు సినీ రంగానికి మంచి గౌరవాన్ని తెచ్చిన శ్రీమాన్ రామోజీరావు పరమపదించడం బాధాకరమైన విషయమన్నారు.
ఈ క్రమంలో రామోజీరావుకు( Ramoji Rao ) భగవంతుని పాదాల చెంత చోటు దక్కాలని వారి ఉద్యమాన్ని వారి కుటుంబ సభ్యులు కొనసాగించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరారు.అయితే రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రేపు జరగనున్నాయి.