సైబర్ నేరగాళ్ళు చేసే మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త.

సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల జిల్లా:సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చిన ఓటీపీ నెంబర్ ఇతరులకు చెప్పవద్దని,ఇతర బ్యాంకు వివరాలు చెప్పవద్దని, ఆన్లైన్లో కస్టమర్ కేర్ నెంబర్లు సెర్చ్ చేయవద్దని ,ప్రజలు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలని జిల్లా ఎస్పీ సుచించారు.వారం రోజుల వ్యవదిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.

 Tasmat Is Wary Of Scams By Cybercriminals , Cybercriminals , Tasmat, Axis Bank-TeluguStop.com

●.

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని ఓటిపి అడగగా బాధితుడు ఓటిపి షేర్ చేసుకోవడం జరిగింది దాంతో 42,000 రూపాయలు నష్టపోయారు.

● ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎం కిసాన్ పేరుతో ఒక Apk ఫైల్ వాట్సాప్ గ్రూపులో రావడం జరిగింది బాధితులు దాన్ని క్లిక్ చేయగానే వారి ఫోన్ హ్యాక్ అవడం జరిగింది తర్వాత కంటిన్యూగా ఓటీపీలు రావడం జరిగింది దాంతో రెండు లక్షల రూపాయలు నష్టపోయారు.

●.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు కొరియర్ సర్వీస్ కోసం గూగుల్ లో సెర్చ్ చేయగా ఒక నెంబర్ నుంచి ఫేక్ కాల్ వచ్చింది వారు ముంబై క్రైమ్ పోలీస్ మాట్లాడుతున్నామని మీ కొరియర్లో ఇల్లీగల్ వసూలు ఉన్నాయని చెప్పి బెదిరించగా వారు నిజమని నమ్మి రెండు లక్షల 25 వేల రూపాయలను పంపించడం జరిగింది.

సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

1.లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.

2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు.ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు.వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.7.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.8.పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి.లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube