నమ్ముకుంటే ముంచేశారుగా.. ఇంతమంది టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్ స్టార్స్ వల్ల షాక్?

ఈ మధ్యకాలంలో చాలామంది టాలీవుడ్( Tollywood ) హీరోలు తమిళ్ డైరెక్టర్ లను నమ్ముకుని చాలా సందర్భాలలో దారుణమైన ఫలితాలను చవిచూసిన విషయం తెలిసిందే.పవన్, బాలకృష్ణ, మహేష్ ( Pawan, Balakrishna, Mahesh )లాంటి స్టార్ హీరోలతో కొందరు యువ హీరోలకు కూడా తమిళ డైరెక్టర్ల వల్ల డిజాస్టర్ చిత్రాలు పడ్డాయి.

 Tamil Directors Who Gave Disaster Movies To Tollywood Heroes, Tamil Directors, D-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కి తప్పనిసరిగా హిట్ అవసరం అనుకుంటున్న సమయంలో తమిళ డైరెక్టర్ విష్ణు వర్ధన్ పంజా చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ మూవీ దారుణంగా నిరాశపరిచింది.

Telugu Disaster, Kollywood, Tamil Directors, Tamildirectors, Tollywood Heros-Mov

విష్ణు వర్ధన్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు అనే చిన్న సంతృప్తి తప్ప ఫ్యాన్స్ కి ఇంకేమి మిగలలేదు.అలాగే సౌత్ లో అగ్రదర్శకులలో మురుగదాస్( Murugadoss ) ఒకరు.ఆయన ప్రతిభని శంకించలేం.కానీ తెలుగులో మాత్రం ఆయనకి ఎందుకో కలసి రావడం లేదు.చిరంజీవితో తెరకెక్కించిన స్టాలిన్ ( Stalin )చిత్రం యావరేజ్.మహేష్ బాబుతో భారీ హిట్ కొడతాడు అనుకుంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

అలాగే మహేష్ కెరీర్ లోనే భారీ నష్టాలు మిగిల్చిన చిత్రం స్పైడర్.అలాగే లింగుస్వామి చిత్రాలు డీసెంట్ గా ఉంటాయి.

Telugu Disaster, Kollywood, Tamil Directors, Tamildirectors, Tollywood Heros-Mov

కానీ రామ్ పోతినేనితో( Ram Pothineni ) తెరకెక్కించిన వారియర్ చిత్రం వర్కౌట్ కాలేదు.రొటీన్ టెంప్లేట్ లో తెరకెక్కించిన చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు.పవన్ తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించడంతో డైరెక్టర్ ఎస్ జె సూర్యకి మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో ఎస్ జె సూర్య చేసిన సైంటిఫిక్ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది.

మహేష్ ఇమేజ్ కి ఈ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు.వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ వెంకట్ ప్రభు.

నాగ చైతన్యతో వెంకట్ ప్రభు పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు.కస్టడీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube