వైరల్ వీడియో: తనతో మాట్లాడడం లేదని యువతిపై కాల్పులు..

తాజాగా ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh )రాష్ట్రంలోని ఝాన్సీ నగరంలో ఓ అమ్మాయిపై పిస్టోలుతో కాల్పులు జరిపాడు యువకుడు.20 ఏళ్ల యువతి యువకుడుతో మాట్లాడడానికి నిరాకరించినందుకు సదరు యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో యువతిపై కాల్పులు జరిపే ముందు ఆ యువతి యువకుడి నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించినట్లు కనపడుతుంది.

 Viral Video Shot At Young Woman For Not Talking To Her , Viral Video, Social Med-TeluguStop.com

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయిని గత ఆరు నెలల నుంచి ప్రేమిస్తున్నానంటూ వెనుక పడుతూ వేధిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.ఈ ఉదాంతం రోడ్డుపై ఉన్న సిసి టీవీ ఫోటేజీలో రికార్డు అయింది.

తనతో మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్న సమయంలో చాలాసార్లు అతడిని మాట్లాడనివ్వకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేయగా.చివరికి ఆ యువకుడు ఇలాంటి అఘాయిత్యంకు పాల్పడ్డాడు.ఇక జూన్ ఆరో తారీఖున అమ్మాయి కళాశాలలో పరీక్ష ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో రోహిత్ ( Rohit )అనే యువకుడు ఆ అమ్మాయిపై ఈ పాడు పనికి పాల్పడ్డాడు.

అయితే అలా పిస్టోల్ తీసి కాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగి అమ్మాయి గన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సంఘటనలో చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.రోహిత్ ఆ అమ్మాయి పై కాల్పులు జరపాడు.అయితే ఈ ఘటనలో అమ్మాయికి బుల్లెట్ గాయాలు అవ్వగా ఆసుపత్రిలో చేర్పించగా క్షేమంగా బయటపడింది.

ఇక ఈ సంఘటనకు సంబంధించి అమ్మాయి తల్లి మాట్లాడుతూ.ఇదివరకే రోహిత్ తల్లిదండ్రులతో తాను మాట్లాడాలని ఎటువంటి ఇబ్బంది కలగచేయమని చెప్పిన వారు.

మళ్లీ ఇప్పుడు రోహిత్ ఇలా చేయడంతో పోలీస్ కేసును నమోదు చేసినట్లు పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube