రామానాయుడు ఎంత మంది హీరో, హీరోయిన్లను పరిచయం చేసారో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో రామానాయుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అగ్ర నిర్మాతల జాబితాలో ఇప్పటికి ఆయన పేరు ఉంటుంది.

రామానాయుడు సినిమాలు అంటే అప్పట్లో సూపర్ హిట్ అనే ముద్ర పడిపోయింది.ఈయన పెట్టే ప్రతి రూపాయికి విలువ ఉండాలని తాపత్రయ పడే వ్యక్తి.

అందుకే నిర్మాతగా రూపాయి పెట్టి ఆఫిసులో కూర్చోకుండా ఆయన లొకేషన్ కి వెళ్లి మరీ సినిమాను పర్యవేక్షిస్తూ ఉండేవారట.

అలాగే ఆయన పెట్టే ప్రతి రూపాయి తెరపై కనిపించాలని అనుకునేవారు.

అలాగే మంచి నైతిక విలువలు కలిగిన సినిమాలను నిర్మించేవారు.రామానాయుడు కెరీర్ మొదట్లో ఎంత జాగ్రత్తగా సినిమాలు చేసాడో చివరి వరకు అదే మైంటైన్ చేసారు.

అయితే ఈయన అన్నేళ్ల కెరీర్ లో చాలా మంది హీరో, హీరోయిన్లను పరిచయం చేసారు.అలాగే ఎంతోమంది డైరెక్టర్లను, సాంకేతిక నిపుణులను, రచయితలను ఇలా ప్రతి రంగానికి చెందిన వారిని ఈయన సినీ రంగానికి పరిచయం చేసారు.

ఈయన కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ ను హీరోగా పరిచయం చేయడమే కాకుండా అదే సినిమాతో ఖుష్బూ ను కూడా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసారు.ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అలాగే ప్రేమఖైదీ సినిమాతో ఈవీవీ కి ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఆయన కుమారులు అయినా అల్లరి నరేష్ ను, ఆర్యన్ రాజేష్ ను కూడా ఈయనే పరిచయం చేసాడు.

Telugu Aarthi Agarwal, Allari Naresh, Aryan Rajesh, Prema Khaidi, Ramanayudu, To

అల్లరి సినిమాతో నరేష్ ని, హాయ్ సినిమాతో ఆర్యన్ రాజేష్ ను, ప్రేమఖైదీ సినిమాతో హరీష్ ను హీరోగా, మాలా శ్రీ ను హీరోయిన్ గా, బొబ్బిలి రాజా సినిమాతో దివ్యభారతి ని, నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి అగర్వాల్ ను, కూలీ నెం 1 తో టబూ ను, ప్రేమించుకుందాం రా సినిమాతో అంజలా జవేరీని తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత రామానాయుడిది.ఇలా ఎంతో మంది టాలెంట్ ను ఆయన గుర్తించి వారికీ తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube