టాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంటారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ramgopal Varma ) .ఇలా వివాదాస్పద దర్శకుడిగా ఎంతో పేరు పొందినటువంటి ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కనుక చూస్తే ఈయనకు ఎమోషన్స్ అంటూ ఉండవని చాలామంది భావిస్తూ ఉంటారు.
కానీ ఈయన చాలా ఎమోషనల్ పర్సన్ అని తాజాగా ఈయన చేసిన కామెంట్ చూస్తే అర్థమవుతుంది.ఇండస్ట్రీకి సంబంధించిన వారు తనకు ఎంతో ఇష్టమైనటువంటి వారు ఇద్దరు వ్యక్తులు చనిపోతే తాను నెలరోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా పూర్తిగా డిప్రెషన్ లో ఉండిపోయారట.
ఇలా వారి కోసం వర్మ నెల రోజులు బాధపడ్డారని తెలుస్తోంది.

ఈ విధంగా రాంగోపాల్ వర్మ నెల రోజులు బాధపడిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే… వారు మరెవరో కాదు ఒకరు నటి శ్రీదేవి( Sridevi ) .హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ వీరాభిమాని.ఇలా తన సినిమాలు చూస్తూ తనకు అభిమానిగా మారినటువంటి ఈయన ఏకంగా తనతో కూడా సినిమాలు చేశారు.
ఇలా శ్రీదేవిని ఎంతో ఆరాధించే రాంగోపాల్ వర్మకు ఆమె మరణ వార్త ఎంతో బాధ పెట్టిందని తెలిపారు.ఇలా శ్రీదేవి మరణ వార్త విన్న తర్వాత చాలా బాధపడ్డారని దాదాపు నెల రోజులపాటు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదని ఈయన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇక శ్రీదేవితో పాటు మరొక నటి జియాఖాన్( Jaih Khan ) మరణం కూడా తనని బాగా బాధించిందని తెలిపారు.ఇలా వీరిద్దరి మరణ వార్తలు తనని ఎంతో బాధ పెట్టాయని వీరి మరణ వార్త విని నెల రోజులపాటు డిప్రెషన్ లో ఉండిపోయాను అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్ లో వర్మ తెరకెక్కించిన సినిమా ‘నిశ్శబ్ద్’. ఈ సినిమాలో జియా ఖాన్( Zia Khan ) ప్రధాన పాత్రలో నటించారు ఎంతో టాలెంట్ కలిగినటువంటి ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల 2013 వ సంవత్సరంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతుందనుకున్నటువంటి ఈమె కేవలం మూడు సినిమాలు తర్వాత ఇలా ఆత్మహత్య చేసుకోవడం తనని బాధపెట్టిందని వర్మ తెలిపారు.