దర్శకుడిని గుడ్డిగా నమ్ముతున్న రామ్..

కొందరు దర్శకులేమో హిట్ కోసం తపించి పోతుంటే దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రం తీసిన రెండు సినిమాలను హిట్ అందుకున్నాడు.కళ్యాణ్ రామ్ పటాస్, సాయి ధరం తేజ్ సుప్రీం సినిమాలు అనీల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభను చాటాయి.

 Ram Doing Blind Character His Upcoming Movies-TeluguStop.com

ఇక ఆ జోష్ తోనే తన మూడో సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కమిట్ అయ్యాడు అనీల్.కమర్షియల్ కామెడీకి సరికొత్త పంథాల్లో తీసుకెళ్లే తన సినిమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి.

అయితే రాబోయే సినిమాలో రామ్ ను బ్లైండ్ మ్యాన్ చేస్తున్నాడట దర్శకుడు అనీల్.

మొన్నటిదాక చేస్తున్న సినిమాలన్ని మూస ఫార్ములా అంటూ అపవాదాలు మోసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ సంవత్సరం మొదటి రోజే నేను శైలజ అంటూ మెమరబుల్ హిట్ అందుకున్నాడు.

అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అనీల్ చెప్పిన కథను ఓకే చేసిన రామ్ సినిమాలో గుడ్డివాడిగా నటించేందుకు సిద్ధమవుతున్నాడట.ఇదే విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి, హీరో రామ్ ల ట్విట్టర్ సంభాషణలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.

గుడ్డి వాడిగా అయినా సరే సినిమా బ్రహ్మాండంగా ఉంటుందంటూ అనీల్ చెప్పుకొస్తున్నాడు.మరి రామ్ గుడ్డి అవతారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

అంతేకాదు అనీల్ రావిపూడిని గుడ్డిగా నమ్మి కెరియర్ లో రిస్క్ చేస్తున్న రామ్ గట్స్ కు అందరు షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube