Upasana: మదర్స్ డే అంటూ బేబీ బంప్ పిక్ షేర్ చేసిన ఉపాసన.. వైరల్ పోస్ట్?

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవ సందర్భంగా( Mothers Day ) అందరూ మాతృ ప్రేమలను ఆస్వాదిస్తున్నారు.బిడ్డలంతా తమ తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అమ్మ ప్రేమలని పొందుకుంటున్నారు.

 Ram Charan Wife Upasana Shows Her Baby Bump On Mothers Day Pic Viral-TeluguStop.com

సెలబ్రెటీలు కూడా అమ్మతనాన్ని, అమ్మ ప్రేమలను అందుకుంటున్నారు.ఇక కొత్తగా అమతనాన్ని అందుకునే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రెగ్నెన్సీ ఫోటోలు షేర్ చేసుకుంటూ బాగా మురిసిపోతున్నారు.

అయితే తాజాగా ఉపాసన ( Upasana ) కూడా బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.

మెగా వారి కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈమె వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.ఇప్పటివరకు ఎటువంటి నెగిటివిటీని మోయలేదు.

ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ మెగావారికి తగ్గట్టు కోడలుగా పేరు సంపాదించుకుంది.రామ్ చరణ్( Ram Charan ) భార్యగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగా హెల్త్ టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Telugu Mothers Day, Ram Charan, Upasana-Movie

గత ఏడాది ఉపాసన గర్భం దాల్చగా ప్రస్తుతం ఆమెకు 8వ నెల నడుస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది.ఆ మధ్యనే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి కూడా జరుపుకుంది.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అందర్నీ ఆకట్టుకుంది.అయితే గతంలో ఈమె ప్రెగ్నెన్సీ దాల్చిన విషయం తెలిసినప్పుడు అందరూ ఆమెది నిజమైన ప్రెగ్నెన్సీ యేనా అని చాలామంది అనుమానం పడ్డారు.

Telugu Mothers Day, Ram Charan, Upasana-Movie

మరి కొంతమంది సరోగసి అని కూడా బాగా వార్తలు వచ్చాయి.కానీ ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డు ఫంక్షన్ లో రామ్ చరణ్ స్వయంగా తను ఆరోనెల ప్రెగ్నెంట్ అని చెప్పటంతో ఆ సమయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది.పుకార్లన్నీ అబద్ధమని తేలాయి.నిజానికి అప్పటివరకు ఉపాసన బేబీ బంపుతో కూడా కనిపించినట్లు అనిపించలేదు.

Telugu Mothers Day, Ram Charan, Upasana-Movie

అయితే ఆరోనెల తర్వాత నుంచి కొద్దికొద్దిగా బేబీ బంప్ తో కనిపించింది.అంతేకాకుండా సీమంతం కూడా జరుపుకుంది.అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు వచ్చే క్రెవింగ్స్ గురించి కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా.చాలా రోజులకు తన ప్రెగ్నెన్సీ బంపుతో ఉన్న ఫోటోను పంచుకొని కొన్ని విషయాలు పంచుకుంది.

ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఆ ఫోటో చూసిన వాళ్లంతా మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అంతే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ఆమె అమ్మాతనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక మరో రెండు నెలల్లో రామ్ చరణ్ వారసుడు రాబోతున్నాడని మెగా అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.ఇక ప్రస్తుతం ఉపాసన ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube