ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ పాత్రలో అవన్నీ ఉంటాయ్.. రామ్ చరణ్ హింట్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “RRR“సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేశాయి.

 Rrr, Ram Charan, Jr Ntr, Ntr Role,latest Tollwood News Latest Interview-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అదే విధంగా తెలుగు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో సందడి చేయగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందని చిత్ర బృందం తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రామ్ చరణ్ తేజ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ రాజమౌళి సినిమా అంటే ఎన్ని సర్ ప్రైజెస్ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు కూడా చాలా ఉంటాయి.

ఇక ఈ సినిమాలో కూడా ఎన్నో ట్విస్ట్లుఉంటాయని, ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ప్రతిఒక్క సన్నివేశంలోనూ ఊహించని మలుపులు ఉండబోతున్నాయని ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలియజేశారు.

Telugu Evarumeelo, Gemini Tv, Jr Ntr, Ntr Role, Rajamouli, Ram Charan, Tollywood

ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది.రాజమౌళి గతంలో ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ముందుగా చెప్పిన తేదీ ప్రకారం ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో సందడి చేయగా, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube