రజనీకాంత్( Rajinikanth ) చాలా ఏళ్లుగా సీనియర్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు.అయినా అతనికి సరైన విజయం గత కొన్ని రోజులుగా దొరకలేదని చెప్పాలి.
వాస్తవానికి రజినీకాంత్ అంటే స్టైల్ … స్టైల్ అంటే రజనీకాంత్.ఆ విషయాన్ని మర్చిపోయిన సీనియర్ దర్శకులు( Senior Directors ) అంతా మాస్ యాంగిల్ లోనే రజనీకాంత్ ని చూపించి అతనికి పరాజయాలనే ఇచ్చారు.
దాంతో రజనీకాంత్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు.ఇటీవల విడుదలైన జైలర్ సినిమా రజినీకాంత్ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేసింది.
ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) దర్శకత్వం వహించాడు.ఈ సినిమా విజయం తర్వాత రజనీకాంత్ లో వచ్చిన మార్పు ఏంటి ? ఎందుకు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో మంచి విజయాన్ని ఇచ్చాడు రజనీకాంత్ కి.ఈ సినిమా కథ చాలా రొటీన్ అయినప్పటికీ చూపించిన విధానం బాగుంది.రజనీలోని స్టైల్, గ్రేస్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించాయి.దాంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దీని తర్వాత లాల్ సలాం అనే చిత్రంలో కేవలం క్యామియో పాత్రలో నటించిన రజనీకాంత్ వెట్టేయాన్ సినిమా ద్వారా మళ్ళీ తన పాత రోజులను ప్రేక్షకులకు రుచి చూపించే పనిలో ఉన్నాడు.ఈ సినిమాకి జ్ఞానవేల్( Jnanavel ) దర్శకత్వం అందిస్తున్నారు.
ఈ సినిమాలో కూడా జైలర్ సినిమాకి మించి చాలా స్టైలిష్ గా రజినీకాంత్ ఉండబోతున్నాడట.దాంతో దీనిపై కూడా రజిని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజు( Lokesh Kanagaraju ) తో ఒక సినిమా ఓకే అయింది.ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన రజనీకాంత్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.సూపర్ స్టైల్ తో కేవలం వాచ్ లైన్ సంకేళ్లుగా చూపించిన విధానం కూడా రజనీకాంత్ లుక్కుతో పాటు ఎంతగానో అలరించాయి.నిజానికి లోకేష్ కనగరాజ్ అంటేనే హీరోలను చాలా అదిరిపోయే లుక్ లో చూపిస్తుంటాడు.
గతంలో విజయ్, కమల్ హాసన్, సూర్య వంటి హీరోలకు అద్భుతమైన లుక్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజనీకి కూడా మంచి లుక్ ఇచ్చాడు.దాంతో కేవలం కుర్రాళ్లకు మాత్రమే ఇకపై సినిమా అవకాశాలు ఇవ్వాలనే పనిలో ఉన్నాడట రజిని.
సీనియర్ దర్శకుల కథలు కూడా ఒప్పుకోవడం లేదట.