సూపర్‌ స్టార్‌ రెండు నెలల ముందుగానే..!

కరోనా కారణంగా గత ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్‌ పొడి పొడిగానే జరుగుతున్నాయి.ఈ గత నెల నుండి సినిమాల షూటింగ్స్‌ జరుగుతున్నాయి.

 Rajinikanth New Movie Shooting Starts Soon, Annaatthe, Rajinikanth,annaatthe Sho-TeluguStop.com

స్టార్‌ హీరోలు ఇంకా షూటింగ్‌ ను మొదలు పెట్టలేదు.సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ హీరోగా రూపొందుతున్న అన్నాత్తే సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

ఆ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసేందుకు దర్శకుడు శివ ప్రయత్నాలు చేస్తున్నాడు.కరోనా భయంతో వచ్చే ఏడాది వరకు రజినీకాంత్‌ షూటింగ్‌ లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్నాడు.

కాని ఇతర హీరోలు అంతా కూడా షూటింగ్స్‌ కు రెడీ అవుతున్న కారణంగా సినిమా ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశ్యంతో రజినీకాంత్‌ సిద్దం అయ్యాడు.అందుకు సంబంధించిన షూటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గత నెలలోనే అన్నాత్తే సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.
రజినీ కాంత్‌ లేకుండానే షూటింగ్‌ మొదలు పెట్టారు.

అయితే వచ్చే నెల నుండి రజినీకాంత్‌ కూడా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు.సూపర్‌ స్టార్‌ అన్నాత్తే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శివ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు శివ ఈ సినిమాతో మరోసారి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ లో రజినీ కాంత్‌ నటించాల్సి ఉంది.కేవలం నెల రోజుల వ్యవధిలోనే సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో మూవీకి ఇమ్మాన్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో ముద్దుగుమ్మలు నయనతార, కీర్తి సురేష్‌, ఖుష్బులు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube